నిన్న సన్ రైజర్స్ మీద ఓటమితో దాదాపుగా ఈ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స అవుట్ అయిపోనట్లే. ఐదు వికెట్ల తేడాతో సన్ రైజర్స్ చెన్నై పెట్టిన స్కోరును ఛేజ్ చేసి పారేయటంతో ప్లే ఆఫ్ ఆశలను దాదాపుగా నీరుగార్చుకుంది ధోని సేన. అయితే నిన్న ధోనీ ముందు ఓ టాస్క్ ఉంది. వాళ్లకున్న ఆఖరి 6 మ్యాచ్ ల్లో 6 గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉండి కచ్చితంగా చోటు కూడా సంపాదించొచ్చు. కానీ ఆరు మ్యాచుల టాస్కులో మొదటి మ్యాచులోనే ఓటమి చవి చూసిన చెన్నై ఆదిలోనే హంసపాదులా స్టార్టింగ్ లో ఆగిపోయింది. పోరాటాన్ని మర్చిపోయింది. అయితే ఇదే టైమ్ లో ఆర్సీబీ గతేడాది సాధించిన విజయాల పరంపరను గుర్తు చేస్తున్నారు ఆర్సీబీ అభిమానులు. నిరుడు ఐపీఎల్ లో మొదట ఆడిన 8 మ్యాచుల్లో ఒకటి మాత్రమే గెలిచిన ఆర్సీబీ..తర్వాత ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే ఆడే అన్నీ గెలవాలన్న సిచ్యుయేషన్ లో ఇదిగో ఇలా ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలిచి ప్లే ఆఫ్స్ కి దూసుకెళ్లింది. ప్రతీ మ్యాచ్ లోనూ ఎంజాయ్ చేస్తూ కొహ్లీ అప్పుడు చూపించిన అగ్రెషన్ ను చాలా మంది చెన్నై అభిమానులు తప్పు పట్టారని..కానీ ఇప్పుడు చెన్నై కి ఆ బాధ ఏంటో అర్థమవుతోందా అనేది వారి ఆవేదన. ప్రతీ మ్యాచ్ గెలుస్తూ ఆరు మ్యాచ్ లు విజయం సాధించి ప్లే ఆఫ్స్ కి వెళ్లి ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓఢిపోయినా...ఆ ఫైట్ చేసిన విధానం RCB సాధించిన బ్యాక్ టూ బ్యాక్ విక్టరీస్ తమకు గర్వ కారణం అని అలాంటి ఫైట్ ఈ సారి CSK రిపీట్ చేయలేకపోయింది అని ఆర్సీబీ ఫ్యాన్స్ చెబుతున్న విషయం. అండ్ అది నిజం కూడా. అలాంటి అనూహ్యమైన ఫైట్స్ చేస్తుంది కాబట్టే ఒక్క కప్ గెలవకపోయినా ఆర్సీబీ ఫైటింగ్ స్పిరిట్ కారణంగానే ఆ టీమ్ కి ఓ లోయల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ స్పిరిట్ ఈసారి చెన్నై దగ్గర లోపించింది.